పుట:2015.372412.Taataa-Charitramu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాని తగ్గుటలేదు. రైళ్ళు, మోటార్లు, బైసికిళ్ళు, గ్రామఫోనులు, సినీమా, రేడియో, టెలిగ్రాపు, ముద్రాయంత్రములు, సూదులు, తీగలు, కాగితములు, పెంసిళ్లు, గోనెసంచులు, గాజువస్తువులు, పెద్దదీపములు, రసాయనవస్తువులు మున్నగు మనమువాడుకొనున వెన్నియో చాలవరకు యాంత్రికములే.

ముఖ్యముగ ఆధునిక నాగరికత అయోమయమగుచున్నది. పూర్వము కర్ర నుపయోగించుపట్లగూడ ఇప్పుడు, ఇనుమునే ఎక్కువగా వాడుచున్నారు. ఉక్కువస్తువుల వాడుకయు చాల హెచ్చినది; ఇతరపరిశ్రమల మూలాధారములగు ఇంజనులు మున్నగు యంత్రములన్నియు ఇనుముతోను ఉక్కుతోను చేయబడును. వానికన్నిటికి చౌకగ ప్రశస్తమగు ఇనుము తయారగుట అవసరము, దానికిని ఇతరములకును నేలబొగ్గు, విద్యుచ్ఛక్తి అత్యవసరములగుచున్నవి. అందువలన లోహ, ఖనిజ, విద్యుచ్ఛక్తుల బుట్టించు పరిశ్రమలు ఇతరపరిశ్రమ లన్నిటికిని మూలాధారములై, ప్రతిదేశపు ఆర్థికాభివృద్ధికిని ముఖ్యావసరము లగుచున్నవి. ఇవి యాంత్రికములైనగాని, చౌకగను దృఢముగను ఉండవు.

ఈ వివిధవస్తువులకు మనదేశమున స్వయంసహాయమున పరిశ్రమ లేర్పడవలెను; ప్రస్తుతస్థితిలో మనవారు యంత్రపరిశ్రమల నేర్పర్చకున్నను, ఆస్థానమున అన్ని పనులకును చేతిపరిశ్రమలే వృద్ధియై యుండుననుటకు వీలు లేదు. అప్పుడు