పుట:2015.372412.Taataa-Charitramu.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధారవలన కొండక్రిందయంత్రములద్వారా 60 వేలయశ్వశక్తిగల విద్యుచ్ఛక్తి జనింపజేసి, బొంబాయికి తీగలపైన బంపుటకు నేర్పాటుజరిగెను. కాని తాతాకంపెనీవారు దానిని స్వయముగానడుపలేదు. ఆహక్కును తాతావారివద్ద ఖరీదుకుతీసుకొని, 'ఆంధ్ర వాలీపవర్ సప్లైకంపెనీ' అనుపేర మరియొక సంఘమువా రాయంత్రాలయమును 1922వ సంవత్సరమునుండి జరుపుచున్నారు. 'లోనవ్లా' కట్టడములకును ఈకంపెనీవానికిని కొన్ని వివరములలో భేధముకలదు. దీనికార్యమును జయప్రదముగనే యున్నది.

బొంబాయి మహానగరమందలి వివిధావసరములకు నీరెండుకంపెనీలుపంపు విద్యుచ్ఛక్తియు వినియోగమై, ఇంకనధికముగ కావలసివచ్చెను. అంతట తాతాకంపెనీవా రాపడమటి కనుమల యితరప్రాంతములగూడ తిరుగపరిశోధించిరి. పూనాకు పడమర 25 మైళ్ళదూరమున నాకనుమలలో నీల, మూల, అను రెండునదులు కలియును. వర్ష కాలమున చుట్లుపట్లసెలయేళ్ల నీరీ నీలమూలల సంగమవులోయలో జేరును. ఆనీటినచ్చట 'డాము'లతో నరికట్టి, 16 మైళ్ల వెడల్పుగల చెరువుగజేసి, ఆనీటిప్రవాహముతో క్రొత్తజలపాతమును సృజించి, అందుండి యంత్రమూలమున విద్యుచ్ఛక్తి పుట్టించుటకు, తాతాకంపనీవారు నిశ్చయించిరి. ఈ 'డాము' 150 అడుగుల ఎత్తు, 4000 అడుగులపొడుగు. ఇచట కొండను దొలిచి, అందుండి నీటికాలువను కొండయంచుకును, అందుండి క్రిందికిని, రప్పించిరి. ఇచట 1700 అడుగుల