పుట:2015.372412.Taataa-Charitramu.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎత్తునుండి వచ్చుధారతో విద్యుచ్ఛక్తి కల్గింపబడి, అటనుండి 76 మైళ్లదూరమందున్న బొంబాయికి తీగలపై గొనిపోబడుచున్నది. ఇచటి విద్యుచ్ఛక్తి పరిమితి 170 వేల అశ్వశక్తి వరకుండును. ఇది తాతాపవర్ కంపెనీ అనబడును; 1927 నుండి 1929 వరకు తాతాకంపెనీవారే దీనినిజరిపి, తరువాత కొంతహక్కునుంచుకొని, దీని యాజమాన్యమును తగ్గించుకొనిరి. ఇదియు జయప్రదముగ నున్నది.

బొంబాయిలో తాతాకంపెనీవారి కార్యాలయములన్నియు సౌకర్యమునకై యొకే మహాభవనమున నెలకొల్పబడినవి. దానికి తాతాగారి స్వగ్రామముకు స్మారకముగ 'నవసారిబిల్డింగ్స్‌' అని పేరు పెట్టబడినది.

ఈ మూడుజలవిద్యుచ్ఛక్తి సంఘములును సాలీనా సుమారు 2 1/2 లక్షల అశ్వబలముదగు శక్తిని పుట్టించును. బొంబాయినుండి పూనావరకు నీశక్తి యుండును. బొంబాయిలోని చాల మిల్లులకు నితరకర్మాగారములకు కలిపి, 1 1/2 లక్ష అశ్వశక్తిది ఖర్చు అగును. వీనిరేటు చాల చౌక †[1] యగుటచే, బొంబాయికి మునిసిపలు అవసరములకు, ట్రాముబండ్లకును, ఇటీవల బి. బి. సి. ఐ. కంపెనీవారి రైలులైను రైళ్ల నడుపుటకునుగూడ, ఈకంపెనీలనుండియే విద్యుచ్ఛక్తి (ప్రభుత్వాంగీకారముతో) నందజేయుట కేర్పాటుజరిగి, అట్లు వారందజేయుచున్నారు.

  1. † అచట టోకున యూనిటుకు అర్ధణా చొప్పున విద్యుచ్ఛక్తి దొరకును; మనప్రాంతములందు యూనిటుఖరీదు సుమా రైదణాలు.