పుట:2015.372412.Taataa-Charitramu.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జొచ్చిరి. *[1] అందువలన బొంబాయిప్రాంతమున పరిశ్రమలు వేగముగ వృద్ధియయ్యెను. ఈవిద్యుచ్ఛక్తి జనకయంత్రమునొద్దను ఆతీగలు పోవుదారిని, గూడ, క్రొత్తపరిశ్రమల కర్మాగారములేర్పడెను. పొగబాధ పోయినందున, బొంబాయినగరపు ఆరోగ్యమును అందువలన బాగుపడెను.

కొలదియేండ్లకే యీకంపెనీవారు జనింపజేయు విద్యుచ్ఛక్తి యంతయు నాయామిల్లులువగైరాలకు ఖర్చైపోవుచుండెను. ఇంకను విద్యుచ్ఛక్తి కావలెనని, గిరాకి కలిగెను. అంతట తాతాకంపెనీవా రీకంపెనీ మేనేజరుద్వారా ఆప్రాంతపు ఇతరగిరులనుగూడ పరిశోధించిరి. 'లోనవ్లా'కు 12 మైళ్ళు ఉత్తరమందలి సహ్యాద్రినేయున్న 'ఆంధ్ర' నదియొక్కలోయయు నిందుకు తగినదని తేలెను. ఈలోయకు 19 అడుగులయెత్తు రమారమి 1800 అడుగులపొడుగుగల పెద్ద రాతిప్రాకారములగట్టి, 11 మైళ్ల మహాసరస్సు నాకొండలోయలలో సృజింపజేసి, అటనుండి నీటి

  1. * బొంబాయిలో గృహములు ట్రాంబండ్లు మున్నగువానికి విద్యుచ్ఛక్తి నొక యూరపియను కంపెనీవారు జనులకుసప్లై చేయుచుండిరి. ఈకంపెనీ 1905 కు పూర్వమే యేర్పడియుండెను. ఆట్రాములకును చిల్లరగా గృహములకునుగూడ తాతాకంపెనీనుండి విద్యుచ్ఛక్తిని కొనుటకవకాశ మిచ్చినయెడల, అందరును తాతాకంపెనీనుండియే తీసికొందురు. కోట్లకొలది యూనిట్లశక్తిని జలపాతసహాయమున వైజ్ఞానికముగ అతిజాగ్రత్తతో తయారుచేయుటవలన తాతావారి రేటు ఈయూరపియనుల రేటుకన్న చాలాచౌక. అందువలన చిల్లరలకు ట్రాములకు ఈతాతా కంపెనీవారు స్వయముగ సప్లై చేయకూడదని ప్రథమమందు లైసన్సు నిచ్చునప్పుడు ప్రభుత్వమువారు షరతు నేర్పర్చిరి.