పుట:2015.372412.Taataa-Charitramu.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(గ్రాహకస్థానము)లోని కీలక్షవోల్టుల బలముగల యమ్మహాశక్తి కొనిపోబడును; అందాశక్తి మరల నైదువేల 'వోల్టులకు^' పలచన చేయబడి, నిలవయుంచబడును; అటనుండి భూమిలోపలనుండి వేసిన తీగలద్వారా బొంబాయినగరపు మిల్లులకు నితరయంత్రములకును ఈవిద్యుచ్ఛక్తి చాలచౌకగ సరఫరాచేయబడును. (విద్యుచ్ఛక్తి ప్రసరించుచున్న తీగలను నరులు ఇతరప్రాణులు ముట్టినచో, ఆశక్తిబలమునవారు తక్షణము మరణింతురు. అందువలన విద్యుచ్ఛక్తి ప్రసరించుతీగలు చాల ఎత్తుగనో భూమిలోపలనుండియో పోవలెను.)

నీరు షిరాటా మొదలుకొని కొండలపై నిలవచేయుట, దానిని కొండల క్రిందకు సరియగుధారగ రప్పించుట, కొండక్రింద విద్యుచ్ఛక్తి పుట్టించు యంత్రముల గట్టుట, ఆశక్తిని బొంబాయికి తీగలపై చేర్చి నిలవయుంచుట, ఇట్లీపనియంతయు పదేండ్లు పట్టి, 1920 తో పూర్తియయ్యెను. లోనవ్లా సరస్సునుండి కార్యము 4 ఏండ్లలోనే పూర్తి అయినవి. 1915 నుండియే మిల్లులకు విద్యుచ్ఛక్తి సప్లై ఆరంభించెను. ఆయామిల్లుల మోటార్ల కేగాక అందుల దీపములకు గాలివిసురు 'ఫాను'లు మున్నగువానికిని తాతాకంపెనీనుండియే విద్యుచ్ఛక్తి యందజేయబడును.

ఈచౌక విద్యుచ్ఛక్తితో బొంబాయిమిల్లులవారు బొగ్గు బాధలేకుండ తమమిల్లులను ఇతరయంత్రములను, నడుపుకొన