పుట:2015.372412.Taataa-Charitramu.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇదివరలో 1875 ప్రాంతమున, మధ్యరాష్ట్రమందు తన ఎంప్రెసుమిల్లు స్థాపించుటకు తగుస్థలముకొరకు వెదుకుచుండి నప్పుడు, జంషెడ్జితాతా జబ్బల్‌పురముకు వెళ్ళెను; అచట నర్మదానది వింధ్యగిరినుండి క్రిందకు పడును. ఆజలపాతమునొద్ద తనమిల్లునుంచి, దానిశక్తితో సులభముగ యంత్రముల నడిపింపదలచి, తాతా యాస్థలమును ఖరీదుకిమ్మని ప్రభుత్వమును కోరెను. కాని అక్కడనే, ఒక సన్యాసి ఆశ్రమముంచి, అందొక విగ్రహమునుంచి, పూజించుచుండుట తటస్థించెను. ఆజిల్లాలోని పామరులందరు నచటికివచ్చుచు, ఆవిగ్రహమును దర్శించి, ఆ సన్యాసిని సేవించి పోవుచుండిరి. ఆస్థలమును మిల్లుకై అమ్మినచో, ఆసన్యాసి యటనుండి పోవలెనని, అందుచే చుట్టుపట్లజనులం దుద్రేకము కలుగునని తలచి, ప్రభుత్వమువారు తాతా కోరినక్రయము జరిగించుటకు నిరాకరించిరి. తుదకు జంషెడ్జి తనమిల్లును నాగపురమం దేర్పర్చెను.

తరువాత 1897 లో జంషెడ్జితాతా, 'మిల్లరు' అను నాంగ్లేయవర్తకుడు, గోస్లింగు అనుఇంజనీరు, గుజరాతుప్రాంతపు దుగ్ధసాగరజలపాతముద్వారా జలవిద్యుచ్ఛక్తి జనింపజేయ నిశ్చయించిరి. ఈస్థితిలో వీరిదృష్టి 'లోనవ్లా' వైపు మరలెను.

బొంబాయిప్రాంతమున సహ్యాద్రి, యుత్తరదక్షిణములుగా వ్యాపించి యున్నది. దీనినే పడమటికనుమలు అందుము. (అది మనప్రాంతముకు పడమటిదిశనున్నది) ఈపర్వతపంక్తిలో