పుట:2015.372412.Taataa-Charitramu.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డు, అమెరికా, జర్మనీలందున్నంత విశాలమగు బొగ్గుగనులు మనదేశమున దొరకలేదు. *[1] అందువలన మరియొక బలీయమగుశక్తి దొరకుట యవసరమయ్యెను.

కొన్ని పాశ్చాత్యదేశములందు కొన్నిచోట్ల విజ్ఞానసహాయమున నదులజలపాతముతో విద్యుచ్ఛక్తిని పుట్టించి, బొగ్గుకు బదులు విద్యుచ్ఛక్తితో పెద్దయంత్రముల నడుపుచున్నారు. మనదేశమున, కావేరినది మైసూరులోని శివసముద్రమునొద్ద కొండలనుండి క్రిందకు ప్రవహించుచోట, గొప్ప జలపాతము కలదు; ఆజలపాతమున్నచోట, క్రిందచక్రములనుంచి, ప్రవాహపుదెబ్బచే వేగముగ తిరుగు చక్రయంత్రములద్వారా యచట నొక యూరపియను కంపెనీవారు విద్యుచ్ఛక్తిని పుట్టించుచున్నారు. దానితో యంత్రములు నడుపబడి, మైసూరులో కోలారు స్వర్ణ ఖనులనుండి బంగారు చేయబడును. ఆవిద్యుచ్ఛక్తి బెంగుళూరు మైసూరుల యెలెక్ట్రికుదీపములకుగూడ నుపయోగించుచున్నది. ఇట్లే బొంబాయిప్రాంతమునగూడ చౌకగ విద్యుచ్ఛక్తి దొరకినచో, దానిసహాయముననే బొంబాయిమిల్లులు నడుపవచ్చును. ఆవిధముగ బొగ్గుబాధయు వదలునని జంషెడ్జితాతా ఆలోచించెను. (రసాయనశాలలందు విద్యుచ్ఛక్తి తయారుచేయుటకు చాలసొమ్ము ఖర్చు అగును.)

  1. * ఓఢ్రవంగ ప్రాంతములందుమాత్రము బొగ్గుగనులు సమృద్ధిగనే కలవు.