పుట:2015.372412.Taataa-Charitramu.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బొంబాయినగరమునకు 50 మైళ్ల లోపున 'లోనవ్లా' అను కొండస్థలము కలదు. అందు సముద్రతీరమునకు 2000 అడుగుల ఎత్తున నున్న యొకబంగాళాయందు చల్లదనముకై ప్రతిసాలున కొన్ని నెలలు 'గోస్లింగు' గారు నివసించుచుండిరి. అప్పుడచ్చటి పరిస్థితుల నాయన గమనించెను. ఈకొండలు చాలయెత్తు, పడమటి వానలమబ్బులు మనప్రాంతముకు వచ్చుటకుముందే మాకొండల దాకును. ఇచట నానైఋతివానలవల్ల కుంభవృష్టిగ వర్ష ధారలు పడుచుండును. ఆకొండపైనచుట్టును ఎత్తగుగట్లును మధ్యను విశాలమగుచరియలు రాతినేలయు నున్నవి. అందువలన వర్షోదక మాకొండపైన నిలవయుండి, బాగుగ హెచ్చినప్పుడు పొర్లి నలుప్రక్కలను పారుచుండెను. ఆఎత్తుస్థలమునుండి యానీటి నొక్కప్రక్కగా నొకే పెద్దధారగా క్రిందికి త్రిప్పుచో, గొప్ప జలపాతమేర్పడును. అందుండి సమృద్ధిగ విద్యుచ్ఛక్తి పుట్టింప వచ్చును.

దూరస్థమగు దుగ్ధసాగరజలపాతముకన్న, 'లోనవ్లా'లో హెచ్చుసదుపాయములు కలవు. అది బొంబాయికి చాలదగ్గర; తక్కువఖర్చుతో నావిద్యుచ్ఛక్తిని బొంబాయిమిల్లులకు సప్లై చేయవచ్చును; ఆమహానగరమున విద్యుచ్ఛక్తికి చాల గిరాకి యుండును. 'లోనవ్లా' ప్రాంతమున సాలీనా వేయిదుక్కుల కన్నను హెచ్చుగ వర్షించును. అచట విద్యుచ్ఛక్తిని జనింపజేసి బొంబాయిపురముకు చేర్చుచో, ఆశక్తితో మిల్లులెక్కువబాగుగ