పుట:2015.372412.Taataa-Charitramu.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తాతాలోహయంత్రములకై బొగ్గు యినుము వగైరాల బంపు గనులలో ఇంకను వేలకొలది పనివాండ్రు మధ్యరకపు ఉద్యోగులు భూతత్వజ్ఞులు ఇంజనీర్లు మున్నగువారు పనిచేయుచు, గౌరవజీవనము చేయుచున్నారు.

అభివృద్ధికల్గినకొలదిని, అవసరమునుబట్టి ఈకంపెనీ మూలధనము క్రమముగ హెచ్చింపబడినది. పనిబాగుగనున్నప్పుడాకంపెనీకి సాలీనా సుమారు 75 లక్షలరూపాయల లాభముకలుగును. ఒక గొప్పపరిశ్రమజరుగుచున్నప్పుడు, అందును బట్టి ఇతరపరిశ్రమలకు సహాయముకలుగును. మనదేశపు అనేక రసాయనాది వస్తువులను తమయంత్ర కార్యములకై కొనుచును, తమయినుపవస్తువులను ఇందుజనించు ఉపవస్తువులను దేశీయుల కందజేసియు, మనదేశపు ఇతరపరిశ్రమల కీయంత్రశాలవారు సహకారులగుచున్నారు. †[1]

  1. † తాతాకంపెనీవారి లోహయంత్రశాల జయప్రదమగుట జూచి, మైసూరు దివాను విశ్వేశ్వరయ్యగా రాసంస్థానమున (ఈకంపెనీ ఉద్యోగుల సహాయముతో) భద్రావతిప్రాంతమున లోహయంత్రశాల నేర్పర్చిరి. ఆకర్మాగారమున కొన్నిలోపములవలన మొదట సరిగా పనిజరుగక, కొంతనష్టము వచ్చెను. కాని యిటీవల అది బాగుచేయబడి, ఇప్పుడు చక్కగ పనిచేయుచున్నది. ఇప్పుడిప్పుడు ఉక్కుకార్ఖానా సిమెంటుఫాక్టరీకూడచేర్చి, అందు ఉక్కు సిమెంటుగూడ చేయదలచుచున్నారు. ఇట్లే వంగదేశమందొక కంపెనీవారు రాణిగంజిగనుల బొగ్గుతో దానిసమీపపు ఇనుపగనుల బనిచేయుచు, ఇంకొక లోహయంత్రశాల స్థాపించిరి. దాని యజమానులు ఆంగ్లేయులు; అది తాతావారి యంత్రశాల యంత పెద్దదికాదు; దానికన్ని సౌకర్యములును లేవు.