పుట:2015.372412.Taataa-Charitramu.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విద్యుచ్ఛక్తి నందజేయుదురు. ఈలోహయంత్రశాల అమెరికా, ఇంగ్లండు, జర్మనీలలోని నవీనవాస్తువిజ్ఞానము ప్రకారము కట్టబడిన మహాయంత్రములకుకూడ తీసిపోక, సర్వసమగ్రముగ నుండునట్లుగ నిర్మింపబడినది. ఈపనిపూర్తి యగుటకు సహజముగ చాలయేండ్లుపట్టెను. ఇప్పుడు తాతా లోహయంత్రశాల మన ఆసియాఖండమందును, బ్రిటిషుసామ్రాజ్యమంతటను; ఉన్నయన్నిటిలోను గొప్పదని చెప్పుదురు. ఈయంత్రములం దిప్పుడు సాలీనా సుమారు ఆరులక్షల టన్నుల శుద్ధమగు ఇనుము, 570,000 టన్నుల ఉక్కును తయారుచేయవచ్చును. వానిని వివిధవస్తువులుగా చేయు చాలయంత్రములు దరిమిలాను చేర్చబడినవి.

ఇందు తయారైన ఇనుపవస్తువుల చాలఉపకరణము లిప్పుడు దేశమంతటను అమ్ముచున్నవి. ఇందలి ఇనుము ఉక్కు జపాను ఇంగ్లండు మొదలగు ఇతరదేశములకును ఎగుమతియై, ఆదేశముల పరిశ్రమలతో పోటీగా చలామణి అగుచున్నవి. 1914 నుండి జరిగిన ప్రపంచయుద్ధమున మన ప్రభుత్వమువారికి మెసపొటేమియా, ఆఫ్రికామున్నగు ప్రాంతములకు చాలరకముల యుద్ధసామగ్రులను 1500 మైళ్ళ రైలుపట్టాలను 3 లక్షల టన్నుల ఉక్కువస్తువులను ఈకంపెనీవారు సప్లై చేసిరి. ఇందు ప్రత్యేకము సుమారు 40000 కార్మికులు ఉద్యోగులు పనిచేయుచున్నారు. వారిలో రమారమి నూరుమంది ఉద్యోగులు పాశ్చాత్యులు; తక్కినవారందరు భారతీయులే; మరియు, ఈ