పుట:2015.372412.Taataa-Charitramu.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేయుదురు; అప్పుడు శుద్ధమగు ఇనుము నీటివలె ప్రవహించును. ఈద్రవలోహ మామహాయంత్రములందు అత్యుష్ణమువలన పాలవలెకళపెళకాగును. ఇంకనుశుద్ధిజేసి, అందుబయలుదేరు బూడిదను వేరుచేయుదురు; మిగిలిన పరిశుద్ధప్రవాహ మొకచోట చేర్చబడి, జాగ్రత్తతో మెల్లగ చల్లార్పబడి, ఇనుమగును. అంతట కొన్ని శాస్త్రీయచర్యలు జరిగినంతట, అది ప్రశస్తమగు ఉక్కగును; అది అనేకవిధములగు పనిముట్లుగ, ఆయాయంత్రములందు మార్చబడును. ఇట్లు అన్ని శాఖల యంత్రములు నమర్చబడి, ఆలోహపరిశ్రమ దినదినవృద్ధినొందెను.

ఈకార్ఖానాలందు రైలుపట్టాలు, పనిముట్లు, రేకులు, స్లీపర్లు, స్థంభములు, దూలములు, మున్నగు చాలరకముల లోహవస్తువులు తయారై, ప్రతిసాలున కోట్లకొలది రూపాయల విలువగల వివిధవస్తువులు విక్రయింపబడును. ఆయావైజ్ఞానిక చర్యలలో ప్రతిదానికి వేర్వేరుగ పెద్దయంత్రములుండును. ఆయా వివిధచర్యలు అతిజాగ్రత్తతో జరిగించబడును. అందుకు ప్రకృతిశాస్త్రమున పూర్ణప్రజ్ఞ, ధైర్యసాహసములు, దక్షత, శిల్పము, కావలెను. ఆయాశాస్త్రములందు వాస్తువిద్యయందు నిపుణులగుటయే గాక, ఆయాశాఖాధికారులు; ఉత్సాహులు, సహృదయులు, దూరదృష్టియుతులుగను, ఉండవలెను.

వివిధశాఖలకు, ఈకార్ఖానాలకు పురముకును వలయు బలీయమగు విద్యుచ్ఛక్తి నంతను ఈకంపెనీవారే తమ ప్రత్యేక యంత్రములందు పుట్టించి, తమకార్ఖానాలకు, నగరముకుకూడ,