పుట:2015.372412.Taataa-Charitramu.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లండులనుండి రప్పించిరి. లోహకార్యపు యంత్రముల నడుపు కార్మికులు, ఉద్యోగులు, ఇదివరలో నిచట లేనందున, ఆమహాయంత్రముల నడిపి అందుసరిగ పనిచేయుటకు, వారు రెండువందల మంది తెల్లవారి నుద్యోగులుగ చేర్చుకొనిరి. అందు అమెరికనులు, ఆంగ్లేయులు, జర్మనులు, ముఖ్యులు. కార్ఖానాలగట్టి, పరిశోధించి, యంత్రముల జయప్రదముల నడుపుటకు, వారికి చాలహెచ్చు జీతముల నియవలసివచ్చెను. వెల్సు అను ఒక యమెరికను కొంత కాలమువరకు ముఖ్యుడగు మేనేజరుగ నుండెను. పెరినుగారే ఇంజనీర్లలో ప్రధాని. వీరిక్రింద పార్సీలు బెంగాలీలు మున్నగు భారతీయులనేకులు మొదటినుండియు ఉద్యోగులుగ పనిచేయుచుండిరి.

ఉత్తరపు 'ఝరియా' మున్నగుగనులనుండి నేలబొగ్గు తెప్పించి యంత్రములలో శుద్ధిజేసి, అందు తయారగు 'కోకు' *[1] తో దక్షిణపు లోహఖనులనుండి తెచ్చుపొడిని బాగుగ కరిగింతురు. ఇచట బ్రంహ్మాండమగు ఉక్కు కొలుములందు విద్యుచ్ఛక్తిచే జనించు విపరీతోష్ణముచే నాపొడి ద్రవమగును. దానిని కట్నిప్రాంతనుండి రప్పించు రాతిసున్నముతో కలిపి, శుద్ధి

  1. * మామూలు కర్రబొగ్గుకన్న నేలబొగ్గుచే నెక్కువ వేడి నిప్పు, కల్గును. కాని ఇనుమును కరగించి మంచిఉక్కుగజేయుట కావేడియుచాలదు. అందుచే నేలబొగ్గును ప్రత్యేకయంత్రములందు ముందుగా శుద్ధిజేసి, దానిసారమగు 'కోకు'ను చేయుదురు. దానినిప్పు అత్యుష్ణము; అందుతోఇనుము బాగుగా కరగించి ఉక్కు చేయవచ్చును.