పుట:2015.372412.Taataa-Charitramu.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14. జమ్షెడ్‌పురము.

తాతా లోహకర్మాగారము లొకయటవీప్రాంతమున 'సాక్షి' అను గ్రామమునొద్ద నిర్మింపబడెనుగదా! అప్పటి కాప్రాంతమున పెద్దగ్రామముగాని నాగరిక సౌకర్యములుగాని లేవు. ఈస్థితిలో తాతాకంపెనీవారి కార్ఖానాలు పనిచేయ నారంభించెను; ఆపని యారంభమునుండి కొంద రుద్యోగులును వేలకొలదిని కూలీలును, అచట పనిచేయుచుండిరి. ఆప్రాంతపు 'సంతాలు'లు దృఢగాత్రులే; కాని వారిసంఖ్య చాలతక్కువ. అందువలన సంయుక్త ప్రాంతములనుండి, చుట్టుపట్ల జిల్లాలనుండియు, చాలమంది కూలికచట చేరిరి. ఆకార్ఖానాపనులు వృద్ధియైనకొలదిని పనివాండ్రును ఉద్యోగులును హెచ్చిరి. ఇట్లు వేలకొలది జనులు కుటుంబములతో నచట నివసించుటచే, ఆవన మధ్యమందు కొద్దియేండ్లలోనే యతివేగముగ నొక పెద్దనగర మేర్పడెను. అంతవరకచట నాగరికులకేగాక సామాన్యజనబృందముకు గూడ వలయు వసతులేవియు లేవు.

అందుచే నచట నాయంత్రాలయముకై చేరిన జనులకు వలయు సౌకర్యములన్నిటి నప్పుడు తాతాకంపెనీవారే యేర్పర్చిరి. ఫాక్టరీల కార్మికులు సాధారణముగా కిక్కిరిసిన యిరుకు తాటాకు గుడిసెలలో నుండుచు, తగు నీటివసతివగైరాలు లేక బాధ పడుచుందురు. జంషెడ్జి తాతా మాత్రము మొదటినుండియు తన యంత్రశాలల కనుబంధముగ కార్మికుల కారోగ్యద