పుట:2015.372412.Taataa-Charitramu.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిర్ణయించెను; * అందుచే దానికి ప్రభుత్వపు ప్రోత్సాహము ద్రవ్యసహాయము కూడ కోరెను. మనదేశమున శ్రీమంతులు కొందరు కలరు. కాని ప్రభుత్వాదరము లేనివానికి, ఇతర వ్యక్తులపేర ఉన్న సంస్థలకు, వారు సాధారణముగా సాయము చేయరని తాతాకు తెలియును.

అంతట భారతప్రభుత్వమువారి కోరికపైన, ప్రసిద్ధ పాశ్చాత్య దేశములందలి ఆయావిజ్ఞానాలయముల ప్రణాళికలను సేకరించుటకై, తాతా ప్రకృతి శాస్త్రవేత్త ప్రతిభాశాలియునగు బర్జోర్జిపాద్షా అను ఒక పార్సీ యువకు నంపెను; అంత డాదేశముల దిరిగి, ఆప్రణాళికల విమర్శించి, కొందరు ముఖ్యవైజ్ఞానికుల యభిప్రాయముల గూడ గ్రహించివచ్చి, విపులమగు రిపోర్టునిచ్చెను. ఆరిపోర్టును ప్రభుత్వమువా రందుకొనిరి. అప్పటినుంచి పాద్షా చాల ఉత్సాహముతో పనిచేయుచు, ఈవిషమందును ఇతరోద్యమములందుగూడ తాతా కుటుంబముకు సహాయకుడై, చాల విశ్వాసపాత్రుడుగ కృషిచేసెను. ఆరిపోర్టునందుకొని, 1900 లో ప్రభుత్వమువారా విజ్ఞానాలయ


  • * ఇతరుల పేరుతో స్థాపితమై వారికేప్రఖ్యాతి గల్గించు సంస్థకు తాము సహాయము చేయుటకు సాధారణముగ మనదేశపు శ్రీమంతు లిచ్చగింపరు. తమకు పేరునిచ్చు సత్కారముల జేయుటకు కొందరు శ్రీమంతులు సిద్ధమగుదురు. అట్టివారి యౌదార్యముకు నిరోధము లేకుండుటకును, తాను సహజముగ కీర్తికాముడు కానందువలనను, తాతా యావిజ్ఞానాలయమునకు తన పేరు చేర్చకుండ నిషేధించెను.