పుట:2015.372412.Taataa-Charitramu.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ము స్థాపించుట కంగీకరించిరి. కాని సుప్రసిద్ధులగు వైజ్ఞానికు లొక రీదేశముకువచ్చి స్వయముగ పరిస్థితుల విమర్శింప వలెనని ప్రభుత్వము వారనిరి; అంతట తాతా బ్రిటనుకు వెళ్ళి, అందు వైజ్ఞానిక ప్రముఖుడగు ప్రొఫెసర్ విలియం రామ్సేగారిని లండను నుండి రప్పించెను. తాతాఖర్చుపైన రామ్సేగారు వచ్చి, అయాప్రాంతములదిరిగి, విమర్శించి, 1901 లో కొన్ని సూచనలతో రిపోర్టు నిచ్చెను. తాతా ఆయనను బహూకరించి పంపెను.

పరిశ్రమలకు సహాయకరముగ నుండుటకై, ఈవిజ్ఞానాలయమును బొంబాయిలోనే ఉంచవలెనని, అట్లైనచో నింకను కొందరు వదాన్యులగు కోటీశ్వరులు విత్తమిత్తురని, కొందరనిరి. కాని యట్లెవ్వరును పెద్ద మొత్తముల నిచ్చుట కప్పుడు సిద్ధపడలేదు. మరియు, ఆయాపరిశోధనాదులకు విశేషస్థలము కావలెను; బొంబాయిలో, అంతఖాళీస్థలము దొరకుటకష్టము; దొరకినను చాల ప్రియముగ నుండును. బెంగుళూరెక్కువ యనుకూలముగ తోచెను. బెంగుళూరు మైసూరు సంస్థానపు మధ్యను పీఠభూమిపైనున్నది; అది సమశీతోష్ణము, చాల ఆరోగ్యకరము; ఎక్కువ మన:పరిశ్రమతో పరిశోధనల జేయుటకచ్చటి వాతావరణము చాల ననుకూలము; అచట కావ