పుట:2015.370800.Shatakasanputamu.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     సుమహామంత్రముతోడ నైక్యపదవిన్ శోభిల్లు సర్వేశ్వరా!121
మ. భవదీయాననపంచకంబువలనం బంచాక్షరీమంత్ర ము
     ద్భవమై తత్పదవర్ణపద్ధతుల శుంభత్పంచభూతంబు లు
     [1]ద్భవనంబై యఖిలంబుఁ బుట్టెను లసత్పంచాక్షరీమంత్ర మీ
     భువనాండంబులం దల్లియై సఫలతం బొందించు సర్వేశ్వరా!122
మ. పటుశాస్త్రాగమదృష్టి నివ్విధమునన్ భావించి వీక్షించి యు
     ద్భటవృత్తిన్ భవదీయభక్తినికరబ్రహ్మాండకుండైన నా
     దట లోఁ గాచుకొనంగవచ్చు విదితోద్దండప్రతాపోత్కట
     స్ఫుటకోపానలమూర్తియై యముఁడు గొంపోకుండ సర్వేశ్వరా!123
మ. కలవారై మతిమంతులై రసికులై గంభీరులై ధీరులై
     లలనామన్మథులై సముజ్జ్వలవచోలాలిత్యులై నిత్యులై
     బలవిభ్రాజితులై యశోభరితులై భాసిల్లు భాగ్యోదయుల్
     తొలిజన్మంబుల మిముఁ గొల్చిన మహాత్ముల్ వారు సర్వేశ్వరా!124
మ. ఖలులై యాచకులై విరుద్ధవికటాకారాంగులై పంగులై
     బలహీనాతురులై రుజాపటలతాపచ్ఛన్నులై ఖిన్నులై

  1. ద్భవమై యీయఖిలంబు