పుట:2015.370800.Shatakasanputamu.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మ. అమలామ్నాయవిధిప్రబోధము లసంఖ్యాతంబులై యుండు నా
     గమమార్గోత్తమమంత్రతంత్రము లసంఖ్యాతంబులై యుండుఁ ద
     త్క్రమము ల్నాకవియేల నీవు మెఱయంగా నిన్ను సద్భక్తియో
     గమునం గొల్చి జయింపఁ జేయు మిదె మత్కామ్యంబు సర్వేశ్వరా!118
శా. ఏదేశంబున నేదిశాముఖమునం దేయూర నేవాడ మీ
     పాదాభ్యర్చన సేయు నిర్మలుఁడు సద్భక్తుం డొకండుండె నా
     యాదేశంబును నాదిశాముఖమును న్నాయూరు నావాడ గం
     గాదిస్నాన నదీప్రవాహఫలదంబై యొప్పు సర్వేశ్వరా!119
మ. ఒనరం జిత్తము శుద్ధిలేని నరుఁ డుద్యోగంబునం గోరి చే
     సిన పూజావిభవంబు సువ్రతములున్ శీలంబులు న్మంత్రసా
     ధనముల్ తీర్థంబులుం దపంబులును మీఁదం జెట్టవాఁ డభ్యసిం
     చిన శస్త్రాస్త్రకళానిభంబులగుఁ జర్చింపంగ సర్వేశ్వరా!120
మ. క్రమసంయుక్తి మనంబు బుద్ధియు నహంకారంబుఁ జిత్తంబు నా
     యమలాంతఃకరణంబు నక్షరచతుష్కావాప్తిఁ గావించి పం
     చమవర్ణంబుగ నాత్మఁ గూర్చి కడువాంఛన్ యోగి పంచాక్షరీ