పుట:2015.370800.Shatakasanputamu.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     దన చిత్తంబు భవత్పదస్మరణచేత న్నిన్ను మెప్పింపఁగా
     ననుకూలస్ఫుటనిశ్చలత్వమున రా నభ్యంతరాంగస్థితి
     న్వినుతిం బొందిన తజ్ఞుఁ డీజగములో నీ మెచ్చు సర్వేశ్వరా!114
మ. క్షితి నత్యుగ్రతపంబునందు జఠరాగ్నిం గాలఁగానేల మి
     మ్మతిభక్తిస్థితిఁ బూజసేయు మహనీయ త్వంబు తాఁ జాలదే
     ప్రతిపక్షాలి నడంప రోగభయదుర్భారంబు వారింప న
     ద్భుతసౌఖ్యంబులుఁ బెంప దివ్యసుఖముం బొందింస సర్వేశ్వరా!115
మ. శివవాక్యస్ఫురితాక్షరద్వయ సకృజ్జిహ్వాప్రదేశాత్ముఁడై
     భవదుఃఖాంబుధి దాఁటజూచు తఱిఁ దత్పంచాక్షరీమంత్ర ము
     త్సవలీలం గడుశుద్ధుఁడై జపము వాంఛం జేయు భాస్వద్గుణా
     ర్ణవసౌభాగ్యము మానమెవ్వరికిఁ గాన న్వచ్చు సర్వేశ్వరా!116
మ. అరిషడ్వర్గబలంబులో మలసి మాయావృత్తి నాయం దతి
     స్ఫురణం జేసినవాఁడు మోహుఁ డతనిన్ బోఁద్రోచి నీ భక్తితో
     బరగం గూర్చి వివేకిఁ జేసి నెరయం బాటించి నాయం దధీ
     శ్వరుఁడై యుండఁగదయ్య రౌప్యకుధరవ్యాపార సర్వేశ్వరా!117