పుట:2015.370800.Shatakasanputamu.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     చలనాందోళితచిత్తులై మలినులై జాత్యంధులై మందులై
     తొలిజన్మంబున మిమ్ముఁ గొల్వని దురాత్ముల్ వారు సర్వేశ్వరా!125
శా. ఏయేవేళల నేవయస్సున నరుం డేభూమి నేయూరిలో
     నేయేకర్మము నాచరించు నశుభంబేని న్శుభంబేని దా
     నాయావేళల నావయస్సున నరుం డాభూమి నాయూరిలో
     నాయాకర్మములెల్లఁ దాఁ గుడుచుఁ దథ్యంబింత సర్వేశ్వరా!126
శా. ఆడంబోయినచోట బాలురు వినోదార్థంబు పాషాణముల్
     గూడంబెట్టి శివాలయంబనుచుఁ బేర్కొన్నంతటం జేసి వా
     రాడంబోయి సురాంగనాకలితదివ్యారామచింతామణి
     క్రీడాశైలవిహారులౌదురు మిముం గీర్తింప సర్వేశ్వరా!127
శా. కానీ దారసమన్వితుండు మిగులం గానీఁడు కందర్పునిన్
     గోనీ మానవకోటిలో మరులు పైకోనీఁడు మోహంబునున్
     రానీ రాజితరాజ్యవైభవము పైరానీఁడు గర్వంబునున్
     లో నీవైన మహాత్ముఁ డన్యమునకున్ బోనీఁడు సర్వేశ్వరా!128
మ. తమ లింగార్చనకంటె జంగమము సౌందర్యంబుగాఁ గొల్చు టు
     త్తమభక్తిస్థితి లింగజంగమల సత్సామ్యంబుగాఁ జేఁత మ