పుట:2015.370800.Shatakasanputamu.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     బ్రాయంబన్నది శారదాంబుదతటిత్ప్రఖ్యంబగుం దత్సుఖ
     శ్రేయంబన్నది మాయ యిట్లెఱిఁగియు శీఘ్రంబ నీ ధ్యానసం
     స్థాయీభావనఁ బొందఁ డేమిటి కయో సంసారి సర్వేశ్వరా!83
మ. భవదీయస్థిరభక్తి లబ్ధియు భవద్భక్తైకగోష్ఠీమహో
     త్సవలీలావిభవంబు నీ యనుదినధ్యానానుమోదంబులౌ
     నివి నిత్యస్థితు లారయంగ విధిదేవేంద్రాది భూతాఖిలో
     త్సవభోగస్థితులెల్ల మిథ్యలవి తత్త్వంబెన్న సర్వేశ్వరా!84
మ. తన యుక్తి న్భవదంఘ్రిసేవగల సద్భక్తుండు పాపంబు చే
     సినఁ బుణ్యంబగు భక్తిహీనుఁడు శ్రుతు ల్చేపట్టి పుణ్యంబు చే
     సినఁ బాపంబగు దీనికంతటికిఁ జర్చింపంగఁ జండేశ్వరుం
     డును దక్షుండును సాక్షులెన్న నగరాట్కోదండ సర్వేశ్వరా!85
శా. ప్రారంభించి చకోరపోతము మహీయజ్యోత్స్నయం దుత్సవ
     శ్రీ రంజిల్లుచు వేడ్కనుండు గతి నా చిత్తంబు నీ దివ్యశృం
     గారధ్యానమునం దహర్నిశముఁ జొక్కంజేయవే దేవ శ్రీ
     గౌరీలోచననర్తకీనటనరంగస్థాన సర్వేశ్వరా!86
మ. తరులం బువ్వులు పిందెలై యొదవి తత్తజ్జాతితోఁ బండ్లగున్
     హర మీ పాదపయోజపూజితములై యత్యద్భుతం బవ్విరుల్