పుట:2015.370800.Shatakasanputamu.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     నొడ లెబ్భంగుల నోపునే నియతితో నూహించి నిన్నాత్మలో
     నిడకున్నం జనురూపు నేమికొఱ తా నీక్షింప సర్వేశ్వరా!79
మ. జ్వరసంతాపవిశోషితాంగుఁడు సుధాసంకాశదివ్యాన్నపా
     నరసశ్రేణి భుజింప రోయుగతి నున్మాదేంద్రియధ్వాంతదు
     స్తరసంసారమదప్రమత్తుఁడు మహాసౌఖ్యోత్సవంబైన మీ
     చరణారాధనయందు బుద్ధిఁ జొనుపం జాలండు సర్వేశ్వరా!80
మ. కలయం గాష్ఠయుగంబుఁ గూర్చి తరువంగా బుట్టి తత్సాధనం
     బుల రెంటిన్ దహియించు వహ్నిగతిఁ దాఁ బొల్పొందఁ గాయంబు సం
     ధిల సత్కర్మముతో మథింపఁగ భవచ్చిద్భక్తి సద్వహ్ని యు
     జ్జ్వలమై కాయముఁ గర్మముం జెఱుచుఁ దత్త్వంబెన్న సర్వేశ్వరా!81
మ. స్థిరబుద్ధిం దన సొమ్ము భక్తవరసుక్షేత్రంబులన్ బీజమై
     పరగంగా వెదపెట్టి మీఁద నతిసంపన్నుండగుం గాక దా
     నరిషడ్వర్గము పాలుసేసి భవమాయాగ్రస్తుఁడై యిచ్చ నె
     వ్వరి వేఁడం జనువాఁడొకో విషయదుర్వ్యాపారి సర్వేశ్వరా!82
శా. కాయంబన్నది వారిబుద్బుదసదృక్షం బందు రూపింప లేఁ