పుట:2015.370800.Shatakasanputamu.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాతృశతకము

307


మ్మనమున సంతసిల్లుచుఁ గుమారునిఁ గన్నఫలంబుఁ గంటిఁగా
యని తలపోయుచుండుకనకాంగినిఁ ద...

64


చ.

వెడవెడ నింక భోజనపువేళ గతించిన బిడ్డఁ డేమొకో
బడి విడి రాఁడు నేఁ డనుచుఁ బాతరలాడుచు నుండునంతలోఁ
గడఁ జనుదేర నెత్తుగొని కౌఁగిటఁ జేరిచి చుంచు దువ్వి మై
బడలిక దీఱి సంతసిలు భామిని ద....

65


చ.

తనయునిముద్దుమాటలకుఁ దా ముదమందుచుఁ దేటనీట మ
జ్జన మొనరించి మోమునను జాఁబిడి సన్నపుఁజేలఁ గట్టి బల్
పెనఁకువ షడ్రసాన్నములు పెట్టి భుజించిన “ముద్ద ముట్టలే”
దని పెఱవారితోఁ బలుకు లాడెడుత...

66


చ.

పలుమఱు తాను నందనుఁడు పాఠకశాలకుఁ బోనినాఁడు “నా
పలుకు వినంగదయ్య మృదుభాషవణ లాడఁగదయ్య సత్యమున్
బలుకఁగదయ్య నీ కెపుడు భాగ్యము గల్గు” నటంచు బ్రేమతోఁ
దెలుపుచు బుద్ధిఁ జెప్పుయువతీమణిఁ ద...

67


చ.

సరసులు మెచ్చఁగా గణితశాస్త్రము నేరిచి సంఖ్య లెల్ల సు
స్థిరమతితోడఁ జెప్పుటకుఁ దెల్వి వహించినయట్టిమంచిలే