పుట:2015.370800.Shatakasanputamu.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

308

భక్తిరసశతకసంపుటము


కరి యగుఁ గాక నాసుతశిఖామణీ యంచుఁ బరాపరేశు స
ద్గురునిఁ దలంచుచో నెదను గోరెడుత...

68


చ.

విమలవిచారశీలుఁడయి విశ్రుతకీర్తి దిశల్ ఘటిల్ల మా
ఘము మొదలైన కావ్యరసకల్పనలు న్మఱి శాస్త్రము ల్పురా
ణములు నలంకృతు ల్మనమునన్ బెనుపారఁగ నెన్ఁ డింక నా
కొమరుఁడు నేర్చునో యనుచుఁ గోరెడుతల్లినిఁ బోల రెవ్వరున్.

69


చ.

స్వరము లలంకృతుల్ కృతులు సయ్యన ముప్పదిరెండురాగముల్
మెఱయఁగఁ దాళమానలయమిశ్రసమంచితఖండజాతిసు
స్థిరఘనతాపసంగతులు తేటపడ న్మఱి పాడనేర్చునా
వరసుతుఁ డెన్నఁ డింక నని వాంఛిలుత...

70


చ.

పొలు పలరారఁగాఁ జదివి పూర్ణతఁ గాంచి వయోవిలాసముల్
వెలయుచునున్న నందనుని వేడుకఁ గన్గొని పెండ్లి చేయఁగా
వలె నని భర్తతో వినయవాక్యములం దగువేళఁ దిన్నఁగాఁ
దెలుపుచు సంతసిల్లెడు సతీమణిఁ ద...

71


చ.

కులమును రూపముం జెలువుఁ గోమలతం దలిదండ్రు లన్నద
మ్ములుఁ గలదానిఁగా సుగుణము ల్గలదానినిఁగా దలంచి పై