పుట:2015.370800.Shatakasanputamu.pdf/309

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

306

భక్తిరసశతకసంపుటము


వినవలె నంచుఁ గోరుచును వేమఱు లాలనసేసి వేడుకన్
దినుమని బువ్వఁ బెట్టుయువతీమణిఁ ద...

60


చ.

మఱి బడిఁ జేరఁబోవునెడ మార్గములోపల ముల్లు నాటునో
మెఱవడి గోవు లేమయిన మీఁదికిఁ జేడ్వడి వచ్చునో యటం
చఱిమురి కొందఱిం బనిచి యాదటఁ దానును బోవ నెంచు వాం
ఛ రహి చెలంగ నెల్లపుడుఁ జయ్యనఁ ద...

61


చ.

కొడు కెటువంటివాఁ డయినఁ గుంభినిలో నదలింపరానిదుం
దుడుకయి యున్న సన్యులకు దొడ్డఱికం బెఱిఁగించుచున్ మదిన్
జిడజిడ మాని సంతసము చిప్పిలఁ గంటికి ఱెప్పచాడ్పునన్
దొడఁబడి ప్రోచుచున్న యలతొయ్యలిఁ దల్లినిఁ బోల రెవ్వరున్.

62


చ.

సదమలరీతు లుల్లసిల సార మెఱింగెడిరీతిఁ జక్కగాఁ
జదివితి వేని భూజనులు సన్నుతి చేసెద రింతె కాక సం
పద లెడఁగూడు నీ కనుచు బాలునకు న్మతి బుద్ధి చెప్పుచో
మది ముద మంది యొప్పెసఁగుమానినిఁ ద...

63


చ.

తనయుఁడు సర్వవిద్యలను దద్జ్ఞతఁ గాంచి పఠించుచున్నచో
విని పరితోషనీరనిధి వెల్లువగాఁ బయి బాఱినట్లు నె