పుట:2015.370800.Shatakasanputamu.pdf/299

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

296

భక్తిరసశతకసంపుటము


కలితసుతావనేచ్ఛఁ జనఁగా మఱి యూహఁదొలంగు దేహళీ
స్థలి నెగదాఁటనేర నని తగ్గులు మిఱ్ఱులు చూచి తిన్నఁగాఁ
గలక దలంగి తా నడచు కామినిఁ ద...

20


మాసము లెల్లఁ బూర్ణమయి మానవతీమణి గర్భవేదనా
యాసముతోడ నుండు తరి నంగన పుత్త్తునిఁ గాంచె నన్నుఁ దా
నాసడి విన్నమాత్రమున నావచనం బమృతప్రవాహధా
రాసమమైనచో మనము రంజిలుత...

21


చ.

విసుకుచు బిడ్డనుం గనినవేదనఁ గుందుచు నున్నయప్పు డా
నిసువును దెచ్చి పొత్తులను నించినచోఁ దనకష్టరీతులన్
మసలక తత్సుతాననవిమర్శ ఘనంబుగఁ జిందుద్రొక్కఁ దాఁ
మసమునఁ బ్రోచు నేర్పు గలమానినిఁ ద...

22


చ.

చిఱుత జనించునంతఁ దనచిత్తము సార్థకమై చెలంగిన
ట్లురుతరభాగ్య మబ్బినటు లుర్వి సమస్తము నేలినట్లు పెం
దురమున గెల్చుచో విజయతూణము లెల్లెడ నాఁటినట్టు ల
బ్బురముగ సంతసిల్లు విరిబోఁడిని దల్లిని బోల రెవ్వరున్.

23


చ.

పురిటిలు సొచ్చియున్నతఱిఁ బుత్త్రునకున్ వివిధోపచారముల్
మెఱవడి చేయువారలను మిక్కిలి ప్రార్థన చేసి దేవతా