పుట:2015.370800.Shatakasanputamu.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాతృశతకము

295


గరగతలేఖ లూర్జితముగాఁ గని పెద్దలు నీకుఁ బుత్త్రులే
పురుగల రన్నమాత్రమున నూరట దోఁప సుతేచ్ఛ లోన ము
ప్పిరి గొన సంతసిల్లి మది బేర్చెడు త ...

16


చ.

నెల నిలిచెంగదే యనుచు నీరజపాణులు పల్కునంతలో
పల నిధిఁగన్నయ ట్లుదరభాగములోపలఁ బిండ ముష్ణమున్
దొలఁగెడురీతి భోజననిధుల్ మఱి గోరుచుఁ బుత్త్రమోహ మ
త్యురుకుతరభంగిఁ గొల్పువగ నుండెడుతల్లినిఁ బోల రెవ్వరున్.

17


ఉ.

వేవిళు లోఁకిరింతలును విన్నదనంబును దోఁప డస్సి గ
ర్భావరణార్భకావనశుభక్రమ మొప్పఁగ మంత్రతంత్రసం
భావన మీఱ మాంత్రికుల భావనఁ జేయుచుఁ బుత్త్రవృద్ధికిన్
దైవము తోడు గావలె సదా యనుత...

18


చ.

నెల నిలువన్ మనోరథము నివ్వటిలంగను బైఁడిరక్షరే
కులు మెడఁగట్టు మోమునను గోరిక మీర విభూతిఁ బెట్టుఁ దా
నలయక గాలి సోఁకెడు నటంచు సుతేచ్ఛను నాడునాఁటి కీ
చెలువున నుత్తమక్రి యలు చేసెడుత....

19


చ.

చెలు లిటు రమ్మటంచుఁ దనుఁ జీఱిన వేసట గర్భగోళసం