పుట:2015.370800.Shatakasanputamu.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. తటతట లేటికిఁ జేసెదు
     కటకట పరమాత్మ నీవు ఘంటాకర్ణున్‌
     ఎటువలె పుణ్యునిఁ జేసితి
     వటువలె రక్షింపుమయ్య యచ్యుత కృష్ణా!71
క. తురగాధ్వరంబుఁ జేసిన
     పురుషులకును వేఱెపదవి పుట్టుట యేమో
     హరి మిముఁ దలఁచిన వారికి
     నరుదా కైవల్యపదవి యచ్యుత కృష్ణా!72
క. ఓ భవబంధవిమోచన
     ఓ భరతాగ్రజ మురారి యోరఘు రామా
     ఓ భక్తకామధేనువ
     ఓ భయహర నన్నుగావుమో హరి కృష్ణా!73
క. ఏతండ్రి కనకకశ్యపు
     ఘాతకుఁడై యతనిసుతుని గరుణను గాచెన్‌
     ప్రీతి సురకోటి పొగడఁగ
     నా తండ్రీ నిన్ను నేను నమ్మితి గృష్ణా!74
క. ఓ పుండరీకలోచన
     యో పురుషోత్తమ ముకుంద యో గోవిందా
     యో పురసంహర మిత్రుఁడ
     యో పుణ్యుఁడ నన్నుఁబ్రోవుమో హరి కృష్ణా!75
క. ఏవిభుఁడు ఘోరరణమున
     రావణుఁ వధియించి లంకరాజుగ నిలిపెన్‌