పుట:2015.370800.Shatakasanputamu.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     దలఁపం జాలక మాన, నేఁ గలసి నీ దాసానువర్గంబుతో
     నిలువం జాలక మానఁబో! కడపటన్ నీనామముల్ విన్నవా
     రలకుం గల్గును మోక్షలక్ష్మి రఘువీరా! జానకీనాయకా!75
మ. తలఁపన్ జిత్రము మీ మహత్త్వములు మీ దాసుల్ మహాభాగ్యవం
     తులు త్రైలోక్యమునన్ బదస్థుఁడు ధ్రువుం డుండున్ నభోమండలిన్,
     బలి పాతాళమునన్, విభీషణుఁడు భూభాగంబునం, బద్మజ
     ప్రలయంబైనను బోవరౌర! రఘువీరా! జానకీనాయకా!76
మ. చెలఁగన్ మర్త్యులు వేగి లేచి తమిచేఁ జేయంగఁ బాపంబు లీ
     కలుషంబుల్ పెడఁబాయ నేదిగతి? యింకన్ ద్రోవ యొండెద్ది? పు
     ర్వులగుంటం బడనీని పోకడయు నేర్పున్ బుద్ధియుం గల్గువా
     రలు నీ సేవకు లౌట లెస్స రఘువీరా! జానకీనాయకా!77
మ. కలకాలంబు వ్రతంబులుం దపములుం గావించి యన్యు ల్తుదిన్
     గలకాలంబును బోలె నిర్జరపురీకాంతాకుచాలింగనం
     బులఁ గొన్నాళ్లు సుఖించి క్రమ్మఱ నిలం బుట్టంగ నే మెచ్చ ని
     ర్మలముక్తిన్ నినుఁ గొల్చి కాంతు రఘువీరా! జానకీనాయకా!78
మ. నిలువెల్లన్ బులకాంకురంబు లొదవన్ నీపాదతీర్థంబుతోఁ
     దులసీపర్ణ మొకించుకంత గొనినన్ దోషాలు ఖండించుఁ గా!