పుట:2015.370800.Shatakasanputamu.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     పొలపాకుల్ దినఁ గాననంబుల బడిన్ బోనేల మోక్షంబు కూ
     రలను న్నారల నేల గల్గు? రఘువీరా! జానకీనాయకా!79
మ. చెలువంబొప్ప సువర్ణముద్ర లితరుల్ చెల్లించుటే క్రొత్త, కా
     కల నీ ముద్రలు చూడఁ జెల్లుబడి చక్రాలంచు వేయించుమం
     డలనాథాగ్రణి క్రొత్త, నీ బలిమి నానావర్ణపుం దోలుము
     ద్రలు చెల్లించితి విందు నందు రఘువీరా! జానకీనాయకా!80
మ. ప్రళయాపాదిత కాలమృత్యు[1]నిభ యీరాకాసి రాకాశివా
     దులు వారింపఁగ [2]నోప నింక నెటఁ జొత్తుం జత్తుఁ గాకన్న సం
     చలితుం గౌశికుఁ గాచి తాటక మహాస్త్రజ్వాలచేఁ ద్రుంచి దో
     ర్బలశక్తిన్ విలసిల్లితౌర! రఘువీరా! జానకీనాయకా!81
మ. చిలుకన్ ముద్దులు చిల్క బిల్చుతఱి రాజీవాక్షి యొక్కర్తు ని
     చ్చలు రామా రఘురామ రావె యనినన్ సాలోక్యసాయుజ్యమున్
     కొలఁదు ల్మీఱఁగ నిచ్చినాఁడవఁట నిన్నున్ బిడ్డపే రిడ్డవా
     రల పుణ్యంబున కెద్దిమేర రఘువీరా! జానకీనాయకా!82
మ. ఇల నిన్నుం దొలుబామునం దలఁప నే నీజన్మమందైన నా
     తలఁపు ల్మీపదపంకజంబులపయిన్ దాపింతు నే నింక బు

  1. వగు నా
  2. నేర