పుట:2015.370800.Shatakasanputamu.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మ. పురసంహారుని చాపమున్ జివుకువంబున్ ద్రుంచి పోఁజూచినన్
     బరశూదగ్రభుజుండు పోవిడుచునే భంజించుఁగాకంచు ని
     ష్ఠురముల్ పల్కిన భార్గవున్ భుజబలాటోపంబు వారించి ని
     ర్భరశాంతంబునఁ గాచితౌర రఘువీరా! జానకీనాయకా!71
మ. స్మరసంహారుఁడు కోరి పొత్తున భుజింపన్ బిల్వ నే రాను, శ్రీ
     హరినామంబులు వేయునెన్నవలె నిత్యంబైన నోమన్న నో
     యరవిందానన! వేయునేటికిని రామా యన్నఁ జాలన్న మం
     త్రరహస్యంబుఁ దలంతు నేను రఘువీరా! జానకీనాయకా!72
శా. బాలత్వంబునఁ గొంతకాలము వృథా పాపంపు దుర్బుద్ధినై
     చాలన్ జవ్వనమందు గర్వమతినై సంసారినై దుష్క్రియా
     జాలభ్రాంతిఁ జరింతుఁగాని నినుఁ గాంక్షం గొల్వలేదయ్య హే
     రాళంబైనది చింత వంత రఘువీరా! జానకీనాయకా!73
శా. సాలగ్రామ శిలాశిలోచ్చయ గయాస్నాన ప్రయాగస్థలుల్
     పోలం జూచెద నంచుఁ బోవఁదలఁతున్ బోలేను మీదాసులన్
     బోలం గానఁగ బుద్ధిపుట్ట దిఁక నేఁ బుణ్యాత్ముఁ డౌటెట్లు? హే
     రాళంబైనది చింత వంత రఘువీరా! జానకీనాయకా!74
మ. కొలువం జాలక మాన, నీ నుతులు పెక్కుల్ సేయుటన్ మాన, నిన్