పుట:2015.370800.Shatakasanputamu.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     వినుమా రీ దురితాంధకారపటలం బేరీతి వీక్షింతు? వు
     గ్రనిశాటాంతక! రామభద్ర! రఘువీరా! జానకీనాయకా!33
మ. మును నే నెన్నఁడు వేదశాస్త్రపఠనంబుల్ రిత్తతీర్థాటనం
     బును దానంబును జేయఁ బోను సతతంబున్ నిన్ను సేవించి కీ
     ర్తనఁ జేయన్ మతిలేదు దానమున కర్థం బల్ప మింకెట్లు బో
     రన నా దుష్కృతముల్ దొలంగు? రఘువీరా! జానకీనాయకా!34
మ. మును నా కెన్నియొ దోసముల్ గలవు నొప్పిం బొందఁగా మ్రంద ర
     మ్మని రౌద్రంబుగఁ గాలుబంటు లన నే రాఁపేరు? నా పేరుఁ బె
     ట్టినవానిన్ బరలోకదూరుఁడని యండ్రే పొండు పొండంచు బో
     రన సాయమ్మయి యడ్డగింపు రఘువీరా! జానకీనాయకా!35
మ. అనఘంబైన దశాశ్వమేధకృత పుణ్యస్ఫూర్తి నీకొక్క మా
     టు నమస్కారము సేయఁ గల్గునని విందున్; యాగధర్మంబులున్
     గొనసాగున్; జననంబు లుక్కడఁగు నీకున్ మ్రొక్కెనేనిన్ బున
     ర్జననంబేది దలంచి చూడ రఘువీరా! జానకీనాయకా!36
మ. దనుజారి జ్వలనాంతకాసుర సముద్రస్వామి వాయు త్రిలో
     చనమిత్రాభవ సూర్యసోమధరణీజాతాంబుజాత ద్విష
     జ్జననాంగీరస శుక్రభానుతనయ స్వర్భానుకేతు ప్రవ
     ర్తనముల్ నీ విభవంబులౌర రఘువీరా! జానకీనాయకా!37