పుట:2015.370800.Shatakasanputamu.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     నందున్ నందుఁడు కన్న చిన్నశిశువున్ నాపాలి పాపాళిఁ బా
     ఱం దోలంగ నృసింహు నిన్ను రఘువీరా! జానకీనాయకా!29
శా. సందిం బూసలలోన నీ కవచరక్షామంత్రరాజంబుఁ బెం
     పొందన్ వ్రాసి ధరించినాతఁడు రిపువ్యూహంబులో నైన నే
     కందుం బొందక వజ్రపంజరములోఁ గాఁపున్న చందానఁ బా
     ఱం దోలుం బగవారి నౌర రఘువీరా! జానకీనాయకా!30
మ. వృథగా దెవ్వఁడు నిన్నుఁ గొల్చినఁ గృపన్ వీక్షించి వాఁ డేమనో
     రథముల్ వేఁడిన నట్లె సేయుదువుగా రక్షావిధేయుండవై
     కథగాదీ వచనంబు నిక్క మటులే కాదేని మున్నేల సా
     రథివై తర్జునుతేరిఁ దోల రఘువీరా! జానకీనాయకా!31
మ. ఘనసారంబును లోనికిం గొనిన శ్రీగంధంబుఁ బైఁ బూసినన్
     దినమున్ మర్దనఁ జేసినం గడిగినన్ దిష్టంబులోనం దొలం
     గని దుర్గంధము నైజ మీముఱికి డొక్కల్ నమ్మి ని న్గొల్వనే
     రని మూఢాత్ముల నేమి చెప్ప రఘువీరా! జానకీనాయకా!32
మ. ఇనుమా రాశ్రితు నిల్ప; వాడ వినుమా రేమాటయున్; సాయకం
     బినుమా రాహవభూమిఁ బూన; విదిగా కింకొండు మేలంచు నీ