పుట:2015.370800.Shatakasanputamu.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     ర్పడ మున్నేసిన యమ్ము వేఱె యొక నారాచమ్మునం ద్రుంచి పే
     ర్పడి తౌరా విలుకాండ్రలోన రఘువీరా! జానకీనాయకా!16
మ. చెడుగన్, గష్టుఁడ, దుష్టచిత్తుఁడఁ, బరస్త్రీలోలుఁడన్, బాలుఁడన్
     జడుఁడన్, మూఢుఁడఁ, గొండెకాఁడను, దురాచారి, న్నిషిద్ధాత్ముఁడన్
     గడుసంగాకరిఁ గల్ల గుల్లఁ గపటిన్ గర్విన్ ననుం గావు మూ
     ఱడి యున్నాఁడను నీవె దిక్కు రఘువీరా! జానకీనాయకా!17
మ. అడుగేవిద్యకు లోనుజేసితివి న న్నావంత నావంతలే
     కడియాసల్ గొనుచున్ దురాత్మకుల నే నర్థించుచున్నాఁడ; నె
     న్నఁడు రక్షించెదు, నీవు నన్ను బలె నెన్నం బేదవా? యేల యా
     ఱడిఁ బెట్టంగ? రమావిహార! రఘువీరా! జానకీనాయకా!18
మ. ప్రణుతింపన్ మృతదేహుఁ జూచి బ్రదికింపన్ బ్రహ్మరుద్రుల్ మరు
     ద్గణనాథాదులు నోప, రద్భుతము గాఁగన్ నీదు భృత్యుండు ల
     క్ష్మణు ప్రాణంబులు దెచ్చెఁ జచ్చినతఱిన్ సంజీవనీప్రక్రియన్
     రణభూభాగములోనఁ దానె రఘువీరా! జానకీనాయకా!19
శా. ఏ తాత్పర్యము గల్గి కొల్చెదవురా? యే నేల నిన్మెత్తురా?
     నీతో నాకుఁ బనేమిరా? యనక మన్నింపం దగున్; మున్ను నీ
     చేతన్ మోక్షముఁ గన్నవారి వినమా చిత్రంబుగా నిర్జరా
     రాతిన్ నాతిని రాతిఁ దొల్లి రఘువీరా! జానకీనాయకా!20