పుట:2015.370800.Shatakasanputamu.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శా. దాతల్ ద్రాతలు తల్లిదండ్రులు మఱిన్ దైవంబు లాప్తుల్ చెలుల్
     భ్రాత ల్దక్కినవారు చుట్టములు మీపాదాలపై నాన నా
     దాత ల్ద్రాతలు తల్లిదండ్రులు మఱిన్ దైవంబు లాప్తుల్ చెలుల్
     భ్రాతల్ సర్వము నీవె కావె రఘువీరా! జానకీనాయకా!21
మ. శ్రుతిపాథోధి మథించి శాస్త్రమహిమ ల్శోధించి యష్టాదశ
     స్మృతు లాలించి మహేతిహాసకథలుం జింతించి తా రొక్క స
     మ్మతమై సన్మును లాచరించిన మహామార్గంబు నీసేవ; దు
     ర్మతు లీమార్గముఁ గానలేరు రఘువీరా! జానకీనాయకా!22
మ. మతి నూహింపరు కొంద ఱీసుకృత మేమార్గంబునం దున్న ను
     గ్రతపోధ్యానము సామగానమును దీర్థస్నానమున్ దానమున్
     గ్రతుసంధానము లేల? నేలఁ దులసిం గర్వయ్యెనో? యూర నీ
     ప్రతిమ ల్లేవొ నమస్కరింప? రఘువీరా! జానకీనాయకా!23
మ. సుతు లంచున్ హితు లంచు బంధుజను లంచుం దల్లులుం దండ్రులున్
     సతులుం బౌత్రులు నంచు నెంచుకొనుచున్ సంసారమోహాబ్ధిలో
     గతజన్మంబులఁ దేలుచున్ మునుఁగుచున్ గర్వించి యే ని న్ననా
     రతముం గొల్వని మోస గల్గె రఘువీరా! జానకీనాయకా!24
మ. క్షితిలోఁ దామును బ్రహ్మసృష్టికిఁ బునస్సృష్టిన్ వినిర్మించియున్