పుట:2015.370800.Shatakasanputamu.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     దీజన్మంబున నిన్నుఁ గొల్వఁ గలిగెన్, హీనుండఁ గా నింక, నే
     రాజన్, నాకెదు రెవ్వ రుర్వి? రఘువీరా! జానకీనాయకా!12
శా. నేఁటం దీఱె ననేకజన్మములనుండి న్నన్ను వెంటాడుచున్
     వాటంబై చనుదెంచు పాపములు; శ్రీవత్సాంక! యీవంక నీ
     పాటల్ పాఠము సేయువారికి మఱిం బాపంబులం బాపుఁ గ
     ర్ణాటాధీశ్వర! యొంటిమిట్ట రఘువీరా! జానకీనాయకా!13
మ. పటునిర్ఘాత కఠోరనాదము ఘనబ్రహ్మాండ భాండంబుఁ బి
     క్కటిలం జేయుచు వచ్చునప్పు డితరుల్ గాండీవినామంబు లె
     న్నుట మేలందురు; వైష్ణవుల్ తలఁప రన్యుం గోరి యెంతెంత దు
     ర్ఘటముల్ వచ్చిన నిన్నెగాక రఘువీరా! జానకీనాయకా!14
మ. కొడుకు ల్బ్రహ్మలు, కూఁతు రీశ్వరశిరఃకూటంబుపైఁ గాఁపురం,
     బుడురాజుం దినరాజుఁ గన్ను, లహిరా జుయ్యాలమంచంబు, నీ
     పడఁతుల్ శ్రీయు ధరిత్రియున్, సవతు చెప్పన్ లేరు నీకన్యు, లా
     ఱడి మర్త్యు ల్గనలేరుగాక రఘువీరా! జానకీనాయకా!15
మ. వడి మీఱంగ నమోఘమై నిగుడు నీ వాలమ్ము వాలమ్ముఁ దాఁ
     కెడు నంచున్ మెడ యొడ్డినన్ జమరిపైఁ గీల్కొన్న కారుణ్య మే