పుట:2015.370800.Shatakasanputamu.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     జిత్రార్థాంచితశబ్దబంధురముగా సేవ్యంబుగా సజ్జన
     శ్రోత్రానందముగా శుభాంచితముగా శోధించి సర్వేశ్వర
     స్తోత్రం బన్నయ చెప్పె నిజ్జగములో శోభిల్ల సర్వేశ్వరా!133
శా. బాలుం డాడెడు మాటలెల్ల నుపమింపం దండ్రికి బ్రౌఢభా
     వాలాపంబులకంటె మించుగతి నే నజ్ఞానభావంబునం
     దాలోచించి రచించినట్టి కృతి యింపారంగ నీకు న్మహా
     లాలిత్యస్తుతికంటెఁ గైకొనుఁగదా శ్లాఘ్యంబు సర్వేశ్వరా!134
మ. పరమార్థంబుగఁ దత్త్వము న్నెఱుఁగ నొప్పందీర్చి డెందంబు నీ
     కరుణాస్థానముఁ జేర్పలేక తన వంకం బోవఁగానిచ్చిరే
     నరకాబ్ధిం బడవైచుఁ దత్క్షణములోనం గానఁ దత్త్వక్షమం
     బరయం జిత్తము శూకలాశ్వము విభంబై యుండు సర్వేశ్వరా!135
మ. భవదంఘ్రిద్వితయార్చనంబును బవత్ప్రఖ్యాతసద్భక్తపుం
     గవగోష్ఠీవిభవంబులు న్విమలసూక్ష్మధ్యానయోగంబు నా
     నివి సంపూర్ణసుఖంబులెన్న మఱి దేవేంద్రాది భోగంబు లు
     త్సవసంబంధములెల్ల దుఃస్థితులు తథ్యంబెన్న సర్వేశ్వరా!136
మ. సమయోద్దిష్టసహస్రపంకరుహపూజాపూరణార్థంబు నే