పుట:2015.370800.Shatakasanputamu.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     ధ్యమభక్తిస్థితి లింగపూజ నధికుండై జంగమోపాసనా
     క్షముఁడై యుండుట భక్తియం దది కనిష్ఠత్వంబు సర్వేశ్వరా!129
శా. శాకాబ్దంబులు వార్ధిషట్కపురజిత్సంఖ్యం బ్రవర్తింప సు
     శ్లోకానందకరంబుగా మహిమతో శోభిల్ల సర్వేశ్వర
     ప్రాకామ్యస్తవ మొప్పఁ జెప్పె శుభకృత్ప్రవ్యక్తవర్షంబునన్
     శ్రీకంఠార్పితమై వసుంధరపయిం జెన్నొంద సర్వేశ్వరా!130
మ. అభిరమ్యంబుగ దూదికొండ మహనీయారాధ్య సోమేశ్వర
     ప్రభు కారుణ్యవసంతసంజనిత మద్వాక్యప్రసూనావళి
     న్విభవం బొప్పఁగఁ గూర్చి యెంతయు లసద్విఖ్యాతి సంపత్సుఖ
     ప్రభవంబైన భవత్పదద్వయము నారాధింతు సర్వేశ్వరా!131
శా. ఏ నిన్నే శరణందు బాంధవులు గానీ యెల్లవారుం బగే
     కానీ మృత్యువు తలక్రిందువడనీ కాలుండు గీవెట్టనీ
     నానాకర్మచయంబు గింజుకొననీ నాకేమి నేరాజ నిం
     తే నీ చాటున దాఁగియున్నపుడు బీతే యింక సర్వేశ్వరా!132
శా. ధాత్రి న్భక్తజనానురంజనముగాఁ దత్త్వప్రకాశంబుగాఁ