పుట:2015.370800.Shatakasanputamu.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     త్రము విష్ణుండు సుభక్తి యేర్పడ భవత్పాదంబు లర్చించి చ
     క్రముఁ దాఁ గైకొని దైత్యకోటి ననిలో ఖండించెఁ దా నీ పద
     క్షమతాసేవ సమస్తదేవతలకు న్సత్త్వంబు సర్వేశ్వరా!137
మ. అమర న్వేదపురాణశాస్త్రములు మున్నాకాంక్షఁ దత్త్వప్రభే
     దము రూపింపఁగ నేరవన్న మఱి యా తత్త్వంబులెట్లన్న ను
     త్తమసంతోషమె కోరునన్న నరుఁ డుత్సాహించి నీ భక్తస
     త్తమపూజారతి నేర్చునే నతఁడు తత్త్వజ్ఞుండు సర్వేశ్వరా!138
మ. అమితోద్యద్భవదీయతత్త్వము మహీయస్తోత్రవాణీవిలా
     సములై యొప్పు సమస్తవేదములు శాస్త్రశ్రేణియున్ దివ్యవి
     భ్రమనాదంబులు నెన్ని చూడ నివి నీ పంచాక్షరీమంత్రభా
     వములైయుండు సమస్తలక్షణముల న్వర్ణింప సర్వేశ్వరా!139
శా. సంకీర్ణాకలితాక్షరత్రయము భాస్వన్నాదబిందుక్రమా
     లంకారద్వితయంబుతోఁ గలిసి లీలన్ దివ్యయోగీంద్రహృ
     త్పంకోద్భూతములందు రూఢమగుచుం బంచాక్షరీమంత్ర మ
     య్యోంకారాత్మకమౌ లసన్మునిగణం బూహింప సర్వేశ్వరా!140