పుట:2015.333901.Kridabhimanamu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పదమిది. విద్యుదుద్ద్యోత: - తటిదుద్ద్యోతము, దర్శయతి - చూపున్ - నట్టనడురే - అఫశ్యక మయిన - గుణసంపాదక మయిన యమూలకపదమిది. జలధరానాం ధారాధన శ్రేణికిన్ - ఝంఝూ - ఉత్తృణఉద్ద్యోతపదములు మక్కికి మక్కిగా గూడ గలవు. ఇట్లీ తెల్గుపద్యము సాతవాహన సప్తశతీ గాధకు దెలు గగుట విస్పష్ట మగుచుండగా, సాతవాహనసప్తశతిని శ్రీనాధుడు తెలిగించుట ప్రఖ్యాతమై యుండగా, శ్రీనాధుని కాలముననే క్రీడాభిరామరచనము జరిగియుండుట (శ్రీనాధుడును వల్లభరాయడును సమ కాలమువారు గాన) సునిసశ్చితమై యుండగా, శ్రీనాధుని యాంద్రీకరణరీతి యీ పద్యమున బరిస్ఫుటమగుచుండగా, క్రీడాభిరామము ప్రేమాభిరామ మనుసంస్కృతరూపకము నకు మక్కికిమక్కిగా దెలుగున బెట్టంబడిన ప్రతిబింబము గాదనుట (ఈ పద్యమునుబట్టి కూడ) యంగీకరించి తీరవలసినదై యుండగా నీ పద్యముగాని, యీ పద్యముగల గ్రంధముగాని శ్రీనాధరచితము గాదనువాదమున కాదరువుండునా? నేనీ పద్యమునకు మూలము నిప్పుడు సాతవాహన సప్తశతి నుండియెత్తి చూపితినిగాన యిక దీనిని బ్రక్షిప్తపద్యముగా బరిగణించి పరిహరింపవలెనను వాదము బయల్పడబోవును గాబోలును ! వాదమా నీకు వందనము ! ఇదివఱకే యిట్టి వాదమొకటి పుట్టియున్నది. "ఈ గ్రంధముతో శ్రీనాధు