పుట:2015.333901.Kridabhimanamu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నకు సంబంధము కలదని యంగీకరింపవలసినదే యనియు శ్రీనాధుడు వల్లభరాయని యెడ గల స్నేహభాంధనములకలిమిచే నీ గ్రంధరచనమున నాతనికి విశేషముగా దోడ్పడి పెక్కు పద్యములు రచించియిచ్చియుండు ననియు, శ్రీనాధ వల్లభరాయల యిర్వుర గౌరవమునకుగూడ నీ యభిప్రాయము నిర్బాధకమైన దనియును-“ “కవి యశో లోభమున వల్లభరాయుడు విభవమొసగి శ్రీనాదునిచే స్వర్తృకముగా జెప్పించుకొనుట నీచపు బని గాన వల్లభరాయుడందు కొడబడె“ ననరాదట! పల్లెగ్రామములలో రైతులిద్దఱు దగవులాడుకొనుచున్నప్పుడు కరణము కాపులు మాధ్యస్థ్యము చేసి యిద్దఱకును కష్టనష్టములు కలుగకుండ గుదుర్చు రాజీపద్ధతియా యిక్కడ యోజింప వలసినది. వల్లభరాయుడు కవియై, గ్రంధకర్తయై యున్నపుడు కొన్ని పద్యములయినను శ్రీనాధునిచే జెప్పించుకొనుట నీచపు బని కాదు కాబోలును.గ్రంధ మామూలాగ్రము శ్రీనాధుని పేరిని బట్టి యిచ్చుచున్నదని గదా నేను జెప్పుచున్నది.

      శ్రీనాధు డిట్టి రచన చేయునా.

క్రీడాభిరామమున మసరభేత్తు ‘ కమఠావతారంబు ‘ ‘ఈమఱి ‘ పూవుంబోడులు ‘ వ్యామగ్రా ‘ హేత్యాది రచ