పుట:2015.333901.Kridabhimanamu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మఱియు నాంధ్రభాషోద్దారకు లగు సి.పి.బ్రౌను దొరగారు క్రీ. 1830 కింకను బూర్వకాలముననే సంకలనము చేసిన చాటుధారలలో 'మీనవిలోచనంబులును ' ఇత్యాది (క్రీడా. 104) పద్యమును శ్రీనాధుని వీధినాటకములోని దానిగా సేకరించిరి. దొరగారికి వేఱొక వీధినాటకముము దొరకలేదు. వారు శృనాధుని వీధినాటకములోనిదిగా విని సేకరించిన పయిపద్యము స్పష్టముగా బూర్వోత్తరసందర్భములతో నీక్రీడాభిరామమున నున్నది.

మఱియు నిప్పటి కేడెనిమిదియేండ్లక్రిందట నేను గుంటూరుమండలమున మోదుకూ రను గ్రామమున బల్లెం కనకరాజుగా రని పేరుగల బట్రాజుగారింట బ్రాచీన తాళపత్రగ్రంధముల బరిశోధించుటలో హరిశ్చందనలోపాఖ్యానపుదాళపత్రప్రతి ముఖపత్రములం దీక్రింది వ్రాతను జూచితిని.

'కాకుళ్ళతిరునాళ్ళనాడు చెప్పిన శ్రీనాధవీధినాటకం-
పామగ్రావనితంబలింబకుచహారాభీలభద్రాకృతుల్
కామాంధల్ ...'
(క్రీడ. 209 పద్యమున నిది సమగ్రగ చూడనగును.)

చ. కలసి పెనంగుకాలమున గాజులచప్పుడు గాదు కంటి కిం
పలరగ జుంజనక్రియకు నడ్దముగా మెడ ద్రాడు గీడు లే