పుట:2015.333901.Kridabhimanamu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దలుగులబాఱుచుండుగుసుమాస్త్రుగృహంబున
                                       వారి పూరముల్
వలపులపుట్టినిల్లు చ్విధవన్ జెడనాడిన నోరు పుచ్చదే!

ఈ రెండు పద్యములే కాక నేను చాటుపద్యమణిమంజరి రెండవభాగమున* గూర్చిన చాటుధారలు, ప్రౌఢ దేవరాయలసభలో డిండిమ శ్రీనాధ వివాదసందర్భమందలి చాటుధారలు పెక్కులుగూడ నక్కడ దొరకెను. శ్రీనాధుడు ప్రౌఢరాయలసభలలో బాలాయువతీ ప్రౌడాలోలల మీద జెప్పినపద్యములును నందున్నవి. అవియెల్ల ననర్ఘరత్నములు! తెనాలితాలూకా మోదుకూరిలోను, రేపల్లె తాలూకా పల్లెకోనలోను విద్వాంసు లగుభట్టురాజులు పూర్వము వెలసియుండిరి. వారు సేకరించిన తాళపత్రగ్రంధములు మంచివి. నిన్న నేడు మంటిపాలయినవి. ఈ విషయము స్థలాంతరము వ్రాసియుంటిని. కనకరాజుగారి యింటిలోని పయి తాళపత్రపుస్తకము పరీధావినామ సం. వైశాఖ శుద్ధ 6 భానువారం వరకు బల్లెం అమ్మిరాజు వ్రాసినది."

పయి రెండుపద్యములలో మొదటిది యించుక పాఠ భెదముతో గ్రీడాభిరామమున గలదు. రెండవదియు నందుండవలసినది కాదగును. క్రీడాభిరామమున బెక్కు


  • 1922 లో బ్రకటితము (1952 లో ద్వితీయముద్రణము)