పుట:2015.333901.Kridabhimanamu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జెనుటచే దిరునామంబు చెమ్మగిల్ల
హాళి డాచేత విడియంబు గీలుకొలిపి
రంగపురిరాజవీధి గానంగ నయ్యె
నాదుమదిగోర్కులూర వైష్ణవవధూటి.
                         (శ్రీనాధునిచాటుధార.)

క్రీడాభిరామములొని వగు నీ క్రిందిపదములు శ్రీనాధుని యితర గ్రంధములందు బహుస్థలముల గానవచ్చును. 'బాలార్కకిరణసంపర్కంబు ' 'వీధీవిటంకంబు ' 'పదియార్వన్నెపసిండి ' 'చెక్కుటద్దములు ' 'కోకిలము పంచముశ్రుతి గొసరినట్లు ' 'కలకంఠీకలకంఠకోమలకుహూకారంబు తోరంబుగాన్ ' 'ఘంటాఘణాత్కారముల్ ' 'కప్పురభొగివంటకము ' 'పెసరుబప్పు (శ్రీనాధునకు గందిపప్పు ప్రియము గాదేమో ! పెసరుబప్పునే బహువారములు పేర్కొన్నాడు) 'ఓలగంధము ' 'మిసిమింతుడు ' 'అలవోక ' 'కట్టెఱ్ఱ ' 'ఉఱ్ఱూతలు ' 'కలికిచూపులు ' 'సప్తపాతాళవిష్టవములు ' 'జంగాళము ' 'అహల్యాజారుడు ' 'ఒనవరి మన్మధుండు ' 'చక్రవాకులు ' 'పాటపాట ' 'వల్లువము ' 'పటితాళించు ' 'కర్ణాటతాటంకిని ' 'ద్యావాపృధ్వవకాశముల్ ' 'దాసనపుబువ్వుజాయ ' 'త్రస్తరులు ' 'ప్రేమ పంధుక్షణాగర్బంబు ' 'కుసుమంబెట్టు ' 'ఱేపాడి '