పుట:2015.333901.Kridabhimanamu.pdf/309

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.అని నుతింపం (?) జెప్పి బొమలమీద వెండ్రుకలువ్రాల
   పూజరిసానిబిడ్డను వెడ్డువెట్టి టిట్టిభునిచేతికిచ్చి యచ్చ
  వెన్నెలలం బొరపొచ్చెంబు లేని మచ్చికల చంద్రమండ
  లంబుమెద దృష్టి నిలిపి టిట్టిభుండు విన నిట్లనియె 291
సీ. కలశపాధోరాశిగారాపునందన !
           కల్యాణములు మాకు గలుగజేయు
  కుసుమకోదండునికూరిమిమామ ! సౌ
         భ్యాభ్యుదయంబు మా కాచరింపు
  రాకవిభావరీరమణీమనోహర !
      సంతోషములు మాకు సవదరింపు
  శౌరిపట్టపుదేవికూరిమిసయిదోడ!
       యైశ్వర్యములు మాకు నాచరింపు
గీ. మనుచు బొజ్జంగినీరమ నర్ఘ్య మిచ్చి
   పచ్చికప్పుర మందంద బడిసివైచి
  మ్రొక్కి రనురాగసంపద మూరిబోప
  జారజాయాపతులు నిండుజందురునకు. 292
క.నటులది దోరసముద్రము
  విటులది యోర్గల్లు కవిది వినుకొండమహా
  పుటభేదన మీత్రితయము
  నిట గూర్చెను బ్రహ్మ రసికు లెల్లను మెచ్చన్ 293