పుట:2015.333901.Kridabhimanamu.pdf/300

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


                                      డొరధర్మాసనము 87
వారు రప్పింప వచ్చె నీవదరుజఱభి
లంజెతల్లియె యిదియు గుల్లాము గాక. 265
వ, అనిన నజ్జరభి భయంబు నొంది సబాసదులకు దండ
    ప్రణామంబు నేసి యాద్రవిళు నుద్దేశించి. 266
శా. నీకుం జేసినబాస యెట్టిదియె తుం
               డీరద్విజశ్రేష్ట! మా
   రాకాచంద్రవిభాస్య కాకతిమహా
        రాజేని బుత్తెంచినం
  గైకో; దెట్టులు నెమి వేయుదును; శృం
        గారంపులేదో టలో
  బైకొం గెత్తికురంబు లొత్తిపరిరం
        భం బీదు లేగ్రోవికిన్ 267
వ. మమ్ము నూరక రట్టుసేయుట ధర్మంబుగా దనుచున్న
   యాధూర్తజఱభిం జూచి యవ్విటలోకంబు "ప్రోడ
  నొక్కనినిమిత్తంబున భంగపెట్టు టయుక్తం బని నీవు
  విటధర్మం బెఱింగినవాడ వానతీయవలయు" ననిన
  గోవిందుండు 268
గీ. కందర్పశాస్త్రవేదులు
   నిందుకు షాణ్మానచింత యేలా నెఱవన్