పుట:2015.333901.Kridabhimanamu.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

                                            మేషయుద్ధము 73
నేయువత్సంబులుంబోలె వాత్సల్యంబునం దనయేలికల
వెంట గంఠగ్రైవేయ ఘంటికాటంకారంబులును విషమ
విషాణకోటిఘటితకపాలాయసాశ్వత్ధపల్లమగుళుచ్చరించొ
శికాఘణఘణాత్కారంబులు చెలంగ యుద్ధక్రీడాసన్న
ద్ధంబులై వచ్చుచున్నయనియీసజీవద్యూతంబుచూతము
కాక యనుచు గౌతూహలంబున నిలిచియున్న యవన
రంబున వాహ్యాలిప్రదేశంబునం బందెగాండ్రు పందెంబు
నొడిసి తలపెట్టిన. 227
చ.ఉభయము బావవీధి జయ
             మొందినభంగి భయం బొకింత లే
  కబిముక మయ్యె వెన్వెనుక
             కై యట కొన్నిపదంబు లేగుచున్
  రబసముతో దువాళి గొని
            భ్రగ్గున దాకెడు జూడు నెట్టిటి
  ట్టిభ ! దిధిధీ యనంగను గ
           డింది నదభ్రము లీ యురభ్రముల్. 228
క.విటలమ్ము లవిసి నెత్తురు
  సొటసొట వడియంగ సమరకూరొత్తములై
  కటుకునను మెండుతగరులు
 చటులాటొపమున రెందు సరిబడ బొరెన్ 229