పుట:2015.333901.Kridabhimanamu.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గీ. వట్టివెదురు మోపు వైచినచందాన
   గుండు గుండుమీద గూలినట్లు
  కడిదిమ్రోత మేషకంఠీరవంబులు
  తాకి తాకి తస్పి తట్తువాఱె. 230
వ ఇట్లు తట్టువాఱిపొట్టేళ్లు నాస్కందం బుడిగి మం
   దనిశ్వాసొచ్చ్వాసంబులై డిల్లపడి మూర్చిల్లిన. 231
సీ. హా హా ! నృపాలసింహాసనాధిష్ఠాన
                 రత్నకంబళకాబిరామరోమ !
   మజ్ఘా! కృషీబసంభవమహాదిక్పాల
             హేలావిహారవాహ్యాశివాహ !
  మాయురే ! ప్రవిలంబమానాందసంపాత
           కుతుకామధావితక్రొష్టురాజ !
  అహహ ! శ్రీవీరభద్రావతారమహేశ
        నిహతదక్షకబంధనిహితవదన !
భళిరె ! మేంఠరాజ బాపు రురభ్రేశ !
ఔర ! యేడకేంద్ర యరరె తగర !
మమ్మ హుంక్రియాభిమానాదరిద్రాణ !
మేలుమేలు గొఱ్ఱెమెండగీడ ! 232
వ. మీకు నీగండంబులు దొలంగుం గాక యనుచు నట
    చని ముందట గక్షవిలంబితతాంమ్రచూడులగునూడు