పుట:2015.333901.Kridabhimanamu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క. చరమాచలశిఖరంబున
    దిరమై యెక్కింతదడవు దినకరు డొప్పెన్
    వరుణువిశుద్ధాంతంబున
    నరవిందాక్షులకు మించుటద్ధం బగుచున్. (భీమ.2-27)
ఇట్టి నింకను గలవు.
"నెఱసంజయము మసమసకని చీకటియం గలసి దిక్చౌధమాట
వాటివికరంబుల వ్రేల విడిచినగురివెందపూసలపేరును బోలె
బొలుపు మిగిలె" (క్రీడా. 272 వ)
క. సమబావ యెండకొనలును
    మసకసకనియిరులు గలసి మన మలరించెన్
    దెసల నలుగడల గుంజా
    విసరంబులసరులు వ్రేల్విడిచిన భంగిన్ (నైషధము 8-12)
వ. సంజకెంజాయయున్ గలయ బెరసి గురువెంద పేరుల
    యందంబు వహించుటయు నైషధము 8-14 వ)
ఇట్టివింకను గలవు.
'గన్నేరుబూచాయ కరమొప్ప నీర్కావి
    మడుగుదొపతి పింజె విడిచి కట్తి ' (క్రీడా. 42 వ)
 గన్నెరుబూజాయ గనుపట్టు జిలుగైన
    సలిలకాషాయవస్త్రంబు గట్టి ' (నైషదము. 8-108)
'గొజ్జంగిపూనీరు గులికి మేదించిన
   గంగమట్టి లలాటకమునూ దీర్చి " (క్రీడా. 42 వ)