పుట:2015.333901.Kridabhimanamu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ్యామగ్రాహ్యపయోధరల్ కుటిలనీలాగ్రాలకల్ తధ్యమి
ధ్యామధ్యస్థితమధ్య బాటవిక సేనాధీశ సీమంతిమల్. (కాశీ 3-53)_
శా.అమోదయిన వేట: లాడుదురు వీహారాద్రికాంతారరే
    భామధ్యంబున జాపటంశృతులతో గంధద్విపశ్రేణులన్
    గామక్షామమనోజ్ఞమధ్యమలు గుంజాభూషణాలంకృతల్
    వ్యామగ్రాహ్యసయోధరల్ శబరసేనాధీశ నీనుంతినుల్! (హరి 5.23)
కాశీఖండ హరవిలాసములందలి యీ పద్యద్వయము పయి మురారి శ్లోకచ్చాయ గలది. 'న్యానుగ్రాహ్య ' పద ప్రయోగమున శీనాధునకు బ్రీతి మెండు. బహువారము లాత డాపదమును బ్రయోగించును.

వ్యామగ్రాహ్యస్తములగుభామినులు (శృంగారనైషధము.8.88)
  ఇది సరిగా భట్టమురారిప్రయుక్తపదమే.

వ్యమగ్రాహ్యకుచంబు లంటి (శివరాత్రి మహాత్మ్యము 3 87)
   క్రీడాభిరామమున గూడ నీ పదము గలదు.
వ్యామగ్రాహ్యనితంబలింబ కుచభారాభీల భద్రాకృతుల్ (క్రీడా.200 ప)
వ. టిట్టిభ యదె చూడు వరుణరాజవారాంగనావిలాస దర్పణాను
    కారియై యహర్బతి క్రుంకబోయె. (క్రీడా. 257 వ)