పుట:2015.333901.Kridabhimanamu.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క. ఆహారవిహారములకొ
    యాహారంబునకునొ విహారంబునకో
    బేహారము మీ కీసం
    దేహారంభంబు మాకు దెలియగ వలయున్ 164
వ.ఆహారంబున కంటేని 165

ఉ.కౌరభోగివంటకము
     కమ్మనిగొదుమపిండివంటయున్
  గుప్పెడుపంచదారయును
     గ్రొత్తగ గాచినయాలనే పెన
 ర్పప్పును గొమ్మునల్లనటి
     పండ్లును నాలుగు నైదు నంజులున్
  లప్పలతోడ గ్రొంబెరుగు
     లక్షణవజ్ఝులయించి రొకకున్ 166

వ. విహారంబున కంటేని దద్ గృహంబున. 167

క. అఱుగొను గుబ్బచన్నులు
    మెఱుగుంగన్నులును గలుగుమెచ్చులనవలా
   కుఱుబోడ ముండరత్నము
   బఱివొవగ విడిసినట్టిబ్రహ్మకు జేజే 168

శా. పూవుంబోడులు లేరె విప్రవిధవల్
                   భూమండలిన్ దానిరే